గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

Oct 20 2026 1:32 AM | Updated on Oct 20 2026 1:32 AM

గణపురం: సోమవారం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని భక్తుల దర్శనార్ధం దుర్గామాత అమ్మవారి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు.

వేట సామగ్రి స్వాధీనం

మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లిలో సోమవారం కాటారం సీఐ భీమేష్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై రమేశ్‌ టీజీఎస్‌పీ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తని ఖీల్లో గ్రామానికి చెందిన దగం మహేష్‌ వద్ద వ న్యప్రాణులను వేటాడేందుకు సిద్ధం చేసిన ఐ దు కిలోల బైండింగ్‌ వైరు, పవర్‌కేబుల్‌, కల్చ్‌వైర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అ దే గ్రామానికి చెందిన లక్ష్మి వద్ద 150 లీటర్ల బె ల్లంపానకం ధ్వంసం చేసి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ఫారెస్టు అధికారు లకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

ఆరుగురి బైండోవర్‌

అటవీ ప్రాంతాలు, పంటపొలాల్లో అక్రమంగా కరెంటు ఉచ్చులు అమర్చకుండా ముందస్తు చర్యలో భాగంగా సోమవారం యామన్‌పల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను మహాముత్తారం తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు మహాముత్తారం ఎస్సై రమేశ్‌ తెలిపారు. ఎవరైనా అటవీ జంతువుల వేటకు లేదా పంట రక్షణ పేరిట విద్యుత్‌ తీగలు అమర్చి ప్రాణాపాయ చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిఎస్సై తెలిపారు.

పెండింగ్‌ వినతులు

పరిష్కరించాలి

ములుగు అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

ములుగు రూరల్‌: ప్రజావాణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రజా వాణి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాసులను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావా ణిలో భూ సమస్యలకు సంబంధించి 2, ఇతర శాఖలకు సంబంధించి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొత్తంగా వచ్చిన నాలుగు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలకు బదలాయించినట్లు అధికారులు వివరించారు.

పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లమా ఇన్‌ మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నీషియన్‌ కోర్సులో 30 సీట్లు, డిప్లమా ఇన్‌ మెడికల్‌ స్టెరిలైజేషన్‌ ఆపరేషన్‌ టెక్నీషియన్‌ కోర్సులో 30 సీట్ల ప్రవేశాలకు ఽనోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ స్వర్ణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 24వ తేదీలోపు ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను సాయంత్రం 5 గంటల లోపు ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని తెలిపారు. అర్హత, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలు తదితర వివరాల కు ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల అధికారిక వెబ్‌సైట్‌, తెలంగాణ పారామెడికల్‌ బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

పాలపిట్టను బంధిస్తే నేరం

ఏటూరునాగారం: పాలపిట్టను బంధిస్తే నేరమని ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ రహమాన్‌ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని నాయకులు, ప్రజలతో ప్రత్యేకంగా ముద్రించిన వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి ప్రచారాన్ని చేపట్టారు. వాల్‌పోస్టర్లను బస్టాండ్‌, మార్కెట్‌, ప్రధాన కూడళ్లలో గోడలకు అతికించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. వన్యప్రాణులు, పక్షులను కాపాడుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement