● విజయదశమి వేడుకలకు సర్వం సిద్ధం
భూపాలపల్లి అర్బన్: తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించి నేడు (పదో రోజు) దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. విజయదశమి సందర్భంగా నేడు అమ్మవారి ఆలయాలన్నీ పండగ శోభ సంతరించుకోనున్నాయి. విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంలో పూజిస్తారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ, సింగరేణి, దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సుమారు 40 ఫీట్ల పొడవైన రావణాసుర బొమ్మను ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం జబర్దస్త్ టీమ్, ప్రముఖ గాయకులు రామ్‌రాథోడ్, వడ్లకొండ అనిల్‌కుమార్, యాంకర్ మౌనిక, కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయదశమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని ఆవరణలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే ఉన్నటువంటి జమ్మి చెట్టుకు పూజలు చేసి చెట్టు ఆకును పంచిపెడుతారు. ఈ వేడుకలను ముఖ్య అతిఽథులుగా కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, సింగరేణి అధికారులు పరిశీలించారు.


