నేరాల నియంత్రణకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు సమష్టి కృషి

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో నేరాల నియంత్రణకు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్‌కుమార్‌ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. వివిధ కేసుల్లో బాధితులకు అందుతున్న నష్టపరిహారం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఉన్న నిందితుల వివరాలు, వారి స్థితిగతులపై జైలు అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి తాడూరి మహతి వైష్ణవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌కుమార్‌ నాయక్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.అఖిల, అడిషనల్‌ ఎస్పీ ఎ.నరేష్‌ కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, అటవీశాఖ అధి కారి అప్పలకొండ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement