నలుగురి బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురి బైండోవర్‌

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

కాళేశ్వరం: ‘ఆగని వేట’ అనే శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి జిల్లా పోలీ సులు స్పందించారు. కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఎస్పీ సంకీర్త్‌ ఆదేశాలతో గ్రామాల్లో ఉచ్చులు వేసే వారిని గుర్తించి బైండోవర్‌ కార్యక్రమాలను పోలీసులు చేపడుతున్నారు. ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ పోలీసులు కూడా ఆరా తీశా రు. శుక్రవారం అడవి జంతువులను వేటాడేందుకు అడవుల్లో విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేసిన నలుగురు వ్యక్తులను ముందస్తు చర్యల్లో భాగంగా మహదేవపూర్‌ తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి ఎదుట బైండోవర్‌ చేసినట్లు మహదేవపూర్‌ ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అడవి జంతువుల వేట కోసం విద్యు త్‌ తీగలు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్య అన్నారు. వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ పరిసరాల్లో, అడవుల్లో ఎవరైనా అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 87126 58116 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలి పారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పోలీసులు ఆయా గ్రామాల్లో ఉచ్చులు వేసే వారిని గుర్తించే పనిలో పడ్డట్లు తెలిసింది. బైండోవర్లకు తరలిరావాలని గ్రామాల్లో పోలీసులు పిలుపునిచ్చినట్లు తెలిసింది.

విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement