ఘనంగా క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా క్రీడాపోటీలు

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో రెండు రోజులుగా నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి లాన్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్లు శుక్రవారం ముగిశాయి. ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. లాన్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో ఆర్జీ–2 ఏరియాకు చెందిన సంజీవ్‌ ప్రథమ, మందమర్రి–బెల్లంపల్లి ఏరియాకు చెందిన రాయనర్సు ద్వితీయ బహుమతి సాధించారు. పురుషుల డబుల్స్‌లో ఆర్జీ–1, 2 ఏరియాకు చెందిన శశిధర్‌రెడ్డి, ఎ.వెంకటేశ్వర్లు జోడీ విజేతగా నిలిచింది. వెటరన్‌ సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లోనూ విజేతలకు బహుమతులు అందజేశారు. బాస్కెట్‌బాల్‌లో భూపాలపల్లి ఏరియా జట్టు ప్రథమ, మందమర్రి ఏరియా జట్టు ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడలు ఉద్యోగుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. సింగరేణి ఉద్యోగుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యామ్‌సుందర్‌, సీనియర్‌ పీఓ సాయికృష్ణ, కార్మిక సంఘాల నాయకులు మోటపలుకుల రమేశ్‌, బి.మధుకర్‌రెడ్డి, అరుణ్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement