ఈ ఏడాది పత్తి పంటకు ఎండ దెబ్బ, తెగులు వ్యాప్తి చెందింది. వాస్తవానికి పంట మంచిగా పండితే ఎకరాకు 15 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఎండ దెబ్బకు, తెగుళ్లు రావడంతో ఎకరాకు 5నుంచి 6 క్వింటాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది, పెట్టుబడులు, ఏరివేత కూలీల డబ్బులు రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి.
– పౌనూరి గణపతి,
పుల్లూరు రామయ్యపల్లి, భూపాలపల్లి
నెలాఖరులో కొనుగోలు
కేంద్రాల ప్రారంభం..
జిల్లాలో ఐదు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొనుగోలు కేంద్రాలకు ప్రతీ రైతు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం అయి ఉండాలి. ఈనెలాఖరు లేదా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. రైతులు దళారులను నమ్మకుండా సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించుకోవాలి.
– నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి
●


