ఎల్‌నినో దెబ్బ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో దెబ్బ

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

తగ్గనున్న ఉత్పత్తి

జిల్లాలో చెరువులు, సహకార సంఘాల వివరాలు

జిల్లాలో నిండని చెరువులు

చేపల

పెంపకంపై

భూపాలపల్లి రూరల్‌: రైతన్నలపైనే కాదు.. మత్స్యకారుల జీవనోపాధిపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువుల్లోకి నీరు రాకపోవడంతో చేపపిల్లల పెంపకం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఇప్పటికే చేపపిల్ల లను చెరువుల్లో వదలిపెట్టగా.. ఈసారి ఇంకా వదల్లేదు. అయితే మరోవారం రోజుల్లో వదలడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో 781 చెరువులు ఉండగా వాటిలో కేవలం 282 చెరువుల్లోనే చేపలను పెంచాలని మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో 3 రిజర్వాయర్లు, 279 పెద్ద చెరువులు, ఇతర కుంటలు, చెరువుల్లోనే చేప పిల్లలు వదలనున్నారు. మిగతా చెరువులు నీరు లేక వెలవెలబోతుండడంతో పెంపకానికి నిరాకరించారు. ఏటా చేపల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.

లోటు వర్షపాతంతో..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షా భావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా జిల్లాలో లోటు వర్షపాతం నమోదై చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. గణపురం మండలం గణపురం సరస్సు, మల్హర్‌ మండలం బొగ్గుల వాగు ప్రాజెక్టులకు గత నెలలో కురిసిన వర్షాలకు వరదలు రావడంతో నీరు చేరింది. అలాగే కొన్ని చెరువుల్లో కొంత మేర నీరు చేరింది. ఈ వరద కూడా రాకపోతే జిల్లాలో మరింత గడ్డు పరిస్థితులు నెలకొనేవి. భూపాలపల్లి భీంఘన్‌పూర్‌కు దేవాదుల నీటితో ఎప్పుడు నీటితో నిండుకొని ఉంటుంది. జిల్లాలోని 781 చెరువులకు గాను కేవలం 3 రిజర్వాయర్లు, 279 పెద్ద చెరువుల్లోనే నీరు ఉండడంతో వాటిలో చేపపిల్లలను పెంచనున్నారు. వీటిలో పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 39.74 లక్షలు 80 నుంచి 100 సైజు చేపపిల్లలు, మిగతా 279 చెరువుల్లో 71.74లక్షల 35 నుంచి 40 సైజు చిన్నపిల్లలు పెంచాలని జిల్లా మత్స్యశాఖ నిర్ణయించింది. గతేడాది జిల్లాలోని 837 చెరువుల్లో 2.10 కోట్ల చేపపిల్లలను ఆగస్టు నెలలోనే వదిలారు. ఈ ఏడాది సగమే చేపపిల్లలను వదలనున్నారు.

వేశాలపల్లిలోని తిప్పిరెడ్డి చెరువు

చెరువుల్లో నీరు లేకపోవడంతో చేపపిల్లల పెంపకం 50 శాతానికిపైగా పడిపోవడంతో ఉత్పత్తి సైతం బాగా తగ్గిపోనుంది. గతేడాది 837 చెరువుల్లో 2.10 కోట్ల చేపపిల్లలను వదలగా దాదాపుగా 1,011 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. గతేడాదితో పోల్చితే ఈసారి తక్కువగా చేపపిల్లలను పెంచుతుండడంతో ఉత్పత్తి కూడా తగ్గిపోనుందని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. ఈ ప్రభావం ప్రజలపై పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చేపల ఉత్పత్తి పెరిగితే తక్కువ ధరలు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తి తగ్గితే ధర పెరిగి ప్రజలపై భారం పడనుంది.

మత్స్య సహకార సంఘాలు: 133

మొత్తం సభ్యులు: 10,426

చెరువులు, కుంటలు: 781

ఈసారి చేపపిల్లలు వదిలే చెరువులు: 282

వదలనున్న చేపవిత్తనాలు: 1.11కోట్లు

ఈసారి 282 చెరువుల్లోనే చేపపిల్లలు పెంచాలని నిర్ణయం

గణనీయంగా తగ్గనున్న దిగుబడి

ప్రశ్నార్థకంగా మత్స్యకార్మికుల

జీవనోపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement