మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులు కల్పించాలి

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆస్పత్రిని సందర్శించి ఎక్స్‌రే యూనిట్‌, ఎంఆర్‌ఐ యంత్రం, విద్యుత్‌ సరఫరా, అత్యవసర విభాగం, తాగునీరు, పార్కింగ్‌ సదుపాయాలను పరిశీలించారు. ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే యంత్రాలకు అవసరమైన విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలని, అత్యవసర రోగులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ తన కాలికి ఇటీవల గాయం కావడంతో ఆస్పత్రిలో ఎక్స్‌రే తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరిటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరత్నం, టీజీఎండీసీ ఈఈ నందు పటేల్‌, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెట్టిచాకిరీ, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ సంయుక్తంగా చేపట్టిన ‘స్వేచ్ఛా గమనం’ ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. బాధితులు 080–69434343 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

రామప్ప నీటి తరలింపు పనులు

వేగవంతం చేయాలి

గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో భూసేకరణ, రీ–సర్వే, పెగ్‌ మార్కింగ్‌ పనులను వేగవంతం చేసి, పెండింగ్‌ ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రామప్ప నుంచి నీటిని తరలించే ప్రాజెక్టు ద్వారా ఎనిమిది మండలాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని, భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని సూచించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ అక్టోబర్‌ 15లోగా భూసేకరణకు అవసరమైన పెగ్‌ మార్కింగ్‌ పూర్తి చేయాలని, రీ–సర్వే పనులను ఆర్డీవో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా నేటినుంచి (గురువారం) రెండు రోజుల పాటు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు, 18 ఏళ్లు నిండిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement