తహసీల్దార్‌ చాంబర్‌లో కూలిన సీలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ చాంబర్‌లో కూలిన సీలింగ్‌

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

మల్హర్‌(కాటారం): కాటారం మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్‌ చాంబర్‌లో సీలింగ్‌, ఫ్యాన్‌తో సహ ఒక్కసారిగా కూలిపోయింది. ఉద యం కార్యాలయ సిబ్బంది తలుపులు తెరిచి చూసే సరికి సీలింగ్‌ పెచ్చులు ఊడి తహసీల్దార్‌ కుర్చీ, టేబుల్‌పై ఉన్న కంప్యూటర్లపై పడి ఉంది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణా పాయం తప్పింది. కార్యాలయ పనివేళలో ప్రమా దం జరిగేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. అయితే కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరి పలుచోట్ల పెచ్చులు ఊడిపోతున్నాయని, వెంటనే మరమ్మతు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.

తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement