ఆరుతడి పంటలు మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు మేలు

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

భూపాలపల్లి: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్‌లో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాల సరఫరా, వ్యవసాయ, విద్యుత్‌, మంచినీటి తదితర రంగాలపై ఎల్‌నీనో ప్రభావం, తదితర అంశాలపై కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఎల్‌నినో భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, సోయాబీన్‌, జొన్న, సజ్జ తదితర పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరవ్‌ శర్మ, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్డీవో హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రీసర్వే పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈనెల 16న ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌ నిర్వహించిన వీసీలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

భూముల రీసర్వే వేగవంతం చేయాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement