అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

గణపురం: వ్యవసాయం, ఉచిత విద్యుత్‌, సాగునీరు, విద్య, ఉపాధి తదితర రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ మండలపార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గణపురం మండలం చెల్పూరులో జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా మాజీ ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ వి ద్యుత్‌ సరఫరా లేక సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం బాధాకరమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు పంటలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు చేరుకున్నాయని, ఇప్పుడు సాగు నీరు ఎక్కువగా అవసరమని, దానికి కావాల్సిన మోటార్లు నడవాలంటే 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే విద్యుత్‌ అధికారులతో సమీక్షించి రైతాంగానికి అవసరమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఆందోళనతో సుమారు 2 గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుల, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతులకు నాణ్యమైన

ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే

గండ్ర వెంకటరమణారెడ్డి

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement