అమరుల త్యాగాలను స్మరించుకుందాం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలను స్మరించుకుందాం

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

భూపాలపల్లి: విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ వెల్లడించారు. జిల్లాలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్‌, పోలీసు సిబ్బందికి రెండు కేటగిరీల్లో తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ బాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. షార్ట్‌ ఫిల్మ్‌, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలి..

పెండింగ్‌ కేసులపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నేరాల పరిస్థితి, పోలీస్‌ స్టేషన్ల పనితీరు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతిని ఎస్పీ సమీక్షించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ నెల 21 నుంచి పోలీసు

సంస్మరణ వారోత్సవాలు

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement