గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

గణపురం: సోమవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామివా రికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని భక్తుల దర్శనార్ధం ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

కల్యాణం.. కమనీయం

రేగొండ: కొడవటంచ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌పై

దాడి కేసులో అరెస్ట్‌

చిట్యాల: విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడిచేసి గాయపరిచిన ఘటనలో నిందితుడు తూముల గణేశ్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్‌ తెలిపారు. నాలుగు రోజుల క్రితం మండలకేంద్రంలో ఘర్షణ జరుగుతుందని సమాచారం మేరకు కానిస్టేబుల్‌ మహేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తూముల గణేశ్‌, కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తూముల గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. రెండవ అదనపు జ్యుడీషియల్‌ జడ్జి దిలీప్‌నాయక్‌ నిందితుడికి 14రోజుల రిమాండ్‌ విధించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని పరకాల సబ్‌ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

గుప్తనిధుల తవ్వకాలపై కేసు నమోదు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం మసీదు వాడలో ఒకరి ఇంట్లో ఆదివారం రాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కాళేశ్వరం ఎస్సై ఈ.సురేష్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల, కాళేశ్వరం ప్రాంతాలకు చెందిన వేణుగోపాల్‌, మోహన్‌, శంకర్‌ వద్ద నుంచి మెటల్‌ డిటెక్టర్‌, ఏడు మొబైల్‌ ఫోన్లు, ఒక పార, బెలెనో కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement