పెరుగుతున్న రాజకీయ జోక్యం | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న రాజకీయ జోక్యం

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో రోజురోజుకూ పెరిగిపోతున్న రాజకీయ జోక్యం, అవినీతికి ముగింపు పలకాలని బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌ కోరారు. ఏరియాలోని కేటీకే 1వ గని, వర్క్‌షాప్‌లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ సంఘాలకు చెందిన కార్మికులు సోమవారం బీఎంఎస్‌లో చేరగా వారికి యూనియన్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అప్పాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శక పాలన సాగాలని కోరారు. కొత్త బొగ్గు ప్రాజెక్టులను సాధించడంతోపాటు సంస్థ ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలన్నారు. కార్మికుల హక్కుల సాధనకు బీఎంఎస్‌ రాజీలేని పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. యూనియన్‌లో చేరిన వారిలో బోయిన మల్లికార్జున్‌, బోలో వెంకటేశ్వర్లు, దీపు, టి.సత్తయ్య, సీహెచ్‌.శ్రీకాంత్‌, పి.దిలీప్‌, మోసం ప్రశాంత్‌, ఎండీ.తాజోద్దీన్‌, దేవులాల్‌, మండ మల్లేశ్‌, సునీల్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, వెల్లబోయిన సుజేందర్‌, యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

అప్పాని శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement