● బాలాలయంలో చండీ హోమం
● అమ్మవారికి విశేష పూజలు
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ఆదిముక్తీశ్వర స్వామివారి బాలాలయంలో ఆదివారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బాలాలయంలో అమ్మవారి బింబానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా పండితులు చండీ హోమం నిర్వహించారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అమ్మవార్ల విగ్రహాలు లేనందున బాలాలయంలో అమ్మవార్ల బింబానికి పూజలు చేస్తున్నారు. ఈసారి అలంకరణలు నిర్వహించడం లేదని ఆలయ వర్గాలు తెలిపారు. ఈఓ మహేశ్, చైర్మన్ అవధాని మోహన్‌శర్మ, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, దేవుడా శ్యామ్ సుందర్, సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్, ఎస్సిసెల్ అధ్యక్షుడు రాజబాబు, అర్చకులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.


