14న సింగరేణి కార్మిక గర్జన | - | Sakshi
Sakshi News home page

14న సింగరేణి కార్మిక గర్జన

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 14న గోదావరిఖనిలో నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జనకు భూపాలపల్లి ఏరియా నుంచి కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామ్మూర్తి, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి పిలుపునిచ్చారు. ఆదివారం ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ఉద్యోగాలు, కార్మికుల లాభాల వాటా ప్రకటనలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నల్లబెల్లి సదానందం, రత్నం అవినాష్‌, కొండికుమార్‌, భాషనపల్లి కుమార్‌, వెంకటరాజం, గోవర్దన్‌, కిరణ్‌, రమేష్‌, మూర్తి, సరోత్తంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement