జిల్లా ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

భూపాలపల్లి అర్బన్‌: మారుమూల భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేసి, పాలనను ప్రజలకు చేరువ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా ఏర్పాటులో ఆయన దూరదృష్టి, చొరవ కీలకమని పేర్కొన్నారు. జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బీఆర్‌ఎస్‌ నిర్వహించిన కార్యక్రమంలో గండ్ర పాల్గొన్నారు. హనుమాన్‌ ఆలయంలో పూజలు చేసి, అంబేడ్కర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్‌ హయాంలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, ఆస్పత్రి, వైద్య కళాశాల, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, డిగ్రీ కళాశాల, సింగరేణి కార్మికుల కోసం వెయ్యి క్వార్టర్లు నిర్మించినట్లు వివరించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ వంటి పథకాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. దశాబ్ది వేడుకల్లో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేడు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మహిళలతో బతుకమ్మ వేడుకలు, ఈ నెల 12న కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజలతో సమావేశం, జిల్లా కోర్టులో న్యాయవాదులతో చర్చ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement