నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగుచేస్తున్న. ఇప్పటివరకు సుమారు రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు అయింది. నెల రోజుల క్రితం విపరీతంగా ఎండలు కొట్టాయి. పోయిన నెల చివరి వారంలో మూడు రోజులు వర్షాలు కురిశాయి. దీంతో పత్తిపంటకు తెగుళ్లు సోకింది. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పత్తి ఏరలేదు. అమ్మలేదు. తెగుళ్లు సోకి పూత, కాత మొత్తం ఎర్రబారింది. రెండు ఎకరాల్లో రెండు క్వింటాళ్లు పత్తి కూడా ఎల్లేటట్టు లేదు. కూలి కూడా గిట్టుబాటు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎంత కరువు వచ్చినా గింత తక్కువ పత్తి దిగుబడి ఎప్పుడు రాలేదు. ఇదే మొదటిసారి చూస్తున్నా.
– ఎండీ అబీద్, రామచంద్రాపురం, చిట్యాల మండలం


