నాకున్న రెండెకరాల్లో పత్తిపంట వేసిన. ఈ సారి పత్తిపంటతో అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది. పెట్టుబడి కోసం ఇప్పటి వరకు రూ.లక్ష ఖర్చు చేసినం. రెండు క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎంత కష్టపడి పత్తి ఏరి అమ్మినా రూ.10వేలు కూడా రావు. కరువు వస్తదని అందరూ చెప్తుంటే పత్తి కొంచెమన్నా ఎల్లదా అనుకున్నా. గింత ఘోరంగా అయితది అనుకోలేదు. ఇప్పటికై నా నీళ్లు కట్టి పంటను కాపాడుకుందామని అనుకున్నా పత్తి మొక్కలు మొత్తం ఎర్రబారినవి. ఏం చేసినా ఇక దిగుబడి అయితే రాదు.
– ఆవుల శ్రీవాణి, కొత్తపల్లిగోరి


