రెండెకరాల్లో పత్తిపంట వేసిన. ఎప్పుడైనా ఎకరానికి 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం వర్షాలు లేక పత్తి మొక్కలు సరీగా ఎదగలేదు. ఒక్కో మొక్క రెండు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు లేదు. ఉన్న మొక్కలకు సైతం పదిలోపే పత్తికాయలు ఉన్నాయి. ఒక్కసారి కంటే ఎక్కువ పత్తి ఏరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. పెట్టుబడి, కూలీల ఖర్చులు కూడా రావు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. నిండా మునిగినట్లే.
– కాటం రవయ్య, రైతు అంకుషాపూర్, టేకుమట్ల మండలం


