యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

భూపాలపల్లి రూరల్‌: యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత వేతనాలతో కూడిన ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం టాస్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ జాబ్‌మేళాకు 142కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొని యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రారంభంలో రూ.10వేల నుంచి రూ.20వేల వేతనంతో ఉద్యోగంలో చేరినా, అనుభవం, నైపుణ్యాలను పెంచుకుంటే రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వేతనం పొందే అవకాశాలు ఉంటాయన్నారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటీతో పాటు టాస్క్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.

మెగా జాబ్‌మేళా గొప్ప అవకాశం..

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా గొప్ప అవకాశమన్నారు. సుమారు 10వేల నుంచి 12వేల వరకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టాస్క్‌ ద్వారా జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ సహకారంతో శిక్షణ కేంద్రానికి విశాలమైన హాలు, ఏసీ వసతులు క ల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్‌ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. యు వత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ కంపెనీలు స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున యువత అర్హతకు తగిన ఉద్యోగాలు సాధించాలన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్‌, టాస్క్‌ సీఈఓ ప్రదీ ప్‌ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ దండు రమేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబా బు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమి షనర్‌ ఉదయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

డిజిటల్‌ టైబ్రరీ ప్రారంభం

వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సాధన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు డిజిటల్‌ లైబ్రరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ గ్రంథాలయాల్లో అందుబాటులో లేని పుస్తకాలను సైతం ఈ–లైబ్రరీ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన నాణ్యమైన అధ్యయన సామగ్రిని డిజిటల్‌ రూపంలో పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement