● నేటి నుంచి బతుకమ్మ సందడి
పుట్టింటికి వచ్చిన ఆడపడుచులా.. రెక్కలు విచ్చిన సీతాకోక చిలుకలా.. కరుణించి కాపాడే అమ్మవారిలా.. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ రానేవచ్చింది.. ఊరూవాడా ఆటపాటల సందడి తెచ్చింది. నేడు ఎంగిలిపూల బతుకమ్మ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పూల దుకాణాలు వెలిశాయి. తంగేడు, బంతి, చామంతి, సీతమ్మ, గునుగు, గుమ్మడి పూల దుకాణాలు ఏర్పాటు చేశారు. పూలను కొనుగోలు చేసిందేందుకు మహిళలు తరలివచ్చారు. పండుగవేళ బతుకమ్మను తీర్చిదిద్దేందుకు ప్రధానమైన బంతిపూల తోటలు మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామంలో పసుపు, నారింజ రంగులతో కనువిందు చేస్తున్నాయి. పూలతోటలన్నీ బతుకమ్మ పండుగ శోభతో కళకళలాడుతున్నాయి.
– భూపాలపల్లి అర్బన్/మహాముత్తారం


