ఎస్పీ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

కాళేశ్వరం: కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, నిర్వహణను పరిశీలించడంతో పాటు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. వివిధ రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సై, స్టేషన్‌ రైటర్‌, సీసీటీఎన్‌ఎస్‌ రైటర్లతో మాట్లాడిన ఎస్పీ ఆన్‌లైన్‌ వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్‌ ప్రక్రియపై ఆరా తీశారు. స్టేషన్‌ పరిధిలో నమోదవుతున్న నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతలు, స్టేషన్‌ నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, బాధితులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్‌లో ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్సై సురేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement