కార్మిక సంఘ కార్యాలయాలపై విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

కార్మిక సంఘ కార్యాలయాలపై విధ్వంసం

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

● బీఎంఎస్‌, టీబీజీకేఎస్‌, తెలంగాణ

సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని సుభాష్‌కాలనీ రోడ్డు వెడల్పులో భాగంగా నిబంధనలు అతిక్రమించి సింగరేణి కార్మిక సంఘ కార్యాలయాలపై మున్సిపల్‌శాఖ అధికారులు విధ్వంసానికి పాల్పడుతున్నారని బీఎంఎస్‌, టీబీజీకేఎస్‌, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు అప్పాని శ్రీనివాస్‌, దేవరకొండ మధు, కామెర గట్టయ్య ఆరోపించారు. గురువారం ఏరియాలోని బీఎంఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి సింగరేణి కార్మిక సంఘాలు సహకరిస్తాయని తెలిపారు. కృష్ణకాలనీకి వెళ్లే రోడ్డును 80 ఫీట్ల వెడల్పు చేస్తూ సుభాష్‌కాలనీ రోడ్డును 200 ఫీట్లకు ఎందుకు పెంచారన్నారు. కార్మిక సంఘాల కార్యాలయాలను తొలగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుట్రలు పన్నుతున్నట్లు తెలిపారు. సింగరేణి ఆస్తులను మున్సిపాలిటీ అధికారులు ధ్వంసం చేస్తుంటే సింగరేణి అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. సింగరేణి ఆస్తులను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement