ఓటు అత్యంత కీలకమైనది | - | Sakshi
Sakshi News home page

ఓటు అత్యంత కీలకమైనది

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

● జ్ఞానేష్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనం

భూపాలపల్లి రూరల్‌: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్‌ టెంపుల్‌ నుంచి అంబేడ్కర్‌ చౌక్‌ వరకు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), టీజేఎస్‌ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు, తొలగింపుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. ఫామ్‌–6, ఫామ్‌–7, ఫామ్‌–8కు సంబంధించిన మార్పులపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అయిత ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేశ్‌, పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గుర్రం దేవేందర్‌, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి మల్లేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొమురయ్య, వైస్‌చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, నాయకులు దాట్ల శ్రీనివాస్‌, ఇస్లావత్‌ దేవన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement