పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 23నుంచి 30వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ లలిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, డీపీఓ శ్రీలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement