50శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

50శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలి

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

పింగిలి శ్రీపాల్‌రెడ్డి

భూపాలపల్లి అర్బన్‌: 50శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ, ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన, సంక్షేమం కోసం పీఆర్‌టీయూటీఎస్‌ నిరంతరం పోరాడుతోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. 50 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్‌సీ సాధించడమే సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. భూపాలపల్లిలోని సింగరేణి కమిటీ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే 50శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు అందించి కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌ డీఏలు, ఉద్యోగుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీ సీఆర్‌టీల 29 రోజుల సమ్మె కాలం వేతనాలు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఎంజేపీ గురుకులాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రేగూరి సుభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కుసునపు కిరణ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ముసుకు తిరుపతిరెడ్డి, లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయి ంచారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇదినూరి రవీందర్‌రెడ్డి, నకిరెడ్డి మహేందర్‌, ఫలిత శ్రీహరి, ఎడ్ల ఉపేందర్‌, కొల్లు మహిపాల్‌రెడ్డి, రాంబాబు, మిరియాల సతీశ్‌రెడ్డి, ఏమి యాకూబ్‌రెడ్డి, కోకిల శ్రీరంగం, మాజీ బాధ్యులు మండల రవీందర్‌రెడ్డి, దేవులపల్లి సత్యనారాయణ, విజయభాస్కర్‌లతో పాటుగా రాష్ట్ర, జిల్లా, మండల శాఖల బాధ్యులు, నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement