బాలాజీ ఆస్పత్రి ఘటనపై విచారణ | - | Sakshi
Sakshi News home page

బాలాజీ ఆస్పత్రి ఘటనపై విచారణ

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

వరంగల్‌

ములుగు

మహబూబాబాద్‌

మల్హర్‌(కాటారం): మండలకేంద్రంలోని బాలాజీ ప్రైవేట్‌ హాస్పిటల్‌ను జిల్లా వైద్యాధికారులు సోమవారం తనిఖీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ సివిల్‌ సర్జన్లు డాక్టర్‌ దేవేందర్‌ (పీఓ ఎన్‌సీడీ), డాక్టర్‌ శ్రీదేవి (పీఓ ఎంహెచ్‌ఎన్‌) హాస్పిటల్‌ను సందర్శించారు. జాదరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఛాతి నొప్పితో ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో జిల్లాకేంద్రానికి తరలిస్తుండగా మృతిచెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. హాస్పిటల్‌ రికార్డులు, కేస్‌ షీట్‌, అందించిన చికిత్స వివరాలు, సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. యాజమాన్యం నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ తప్పనిసరిగా క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యాక్ట్‌ నిబంధనలు పాటించాలని, అత్యవసర సమయంలో రోగులకు ప్రాథమిక చికిత్స అందించి అవసరమైతే సకాలంలో ఉన్నత ఆస్పత్రికి రెఫర్‌ చేయాలని సూచించారు. రోగులపట్ల నిర్లక్ష్యం వహించరాదని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ మౌనిక, సీహెచ్‌ఓ నిర్మల, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

రికార్డులు పరిశీలించిన వైద్యాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement