క్రీడల్లోనూ పేరు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లోనూ పేరు తీసుకురావాలి

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సూచించారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీ, హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భూపాలపల్లి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ మహిళా కానిస్టేబుళ్లు అఖిల, చరిష్మా ప్రతిభ కనబరిచారు. టేబుల్‌ టెన్నీస్‌ డబుల్స్‌ విభాగంలో రెండు రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన అఖిల, చరిష్మాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సోమవారం అభినందించారు. విధి నిర్వహణతో పాటు శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, ఆర్‌ఐ కాశీరాం పాల్గొన్నారు.

తక్షణ పరిష్కారమే లక్ష్యం..

ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ వెల్లడించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18మంది నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement