● సింగరేణి కార్మిక సంఘాల
జేఏసీ నాయకులు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆస్తులు, కార్మిక సంఘాల కార్యాలయాల రక్షణ బాధ్యత యాజమాన్యానిదేనని, నిర్లక్ష్యం చేస్తే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో సింగరేణి కార్యాలయాలను కూల్చేయొద్దని సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో, గనులు, వర్క్‌షాపుల్లో గని మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ, ఆస్తులు, కార్మికుల హక్కులు, కార్మిక సంఘాల కార్యాలయాల పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఆందోళనలకు దారితీసే పరిస్థితులు ఏర్పడితే అందుకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల కోసం సంఘాలు ఐక్యంగా, శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తాయని తెలిపారు. ఆయా గనుల్లో నాయకులు వెలబోయిన సుజేందర్, రాసాకట్ల నర్సింగరావు, అప్పాని శ్రీనివాస్, కామెర గట్టయ్య, పండ్రాల మల్లేష్, బసనపల్లి కుమారస్వామి, రేణుకుంట్ల మల్లయ్య, కాడారి శంకర్, బడితల సుదర్శన్, మా లోత్ ప్రేమ్‌సింగ్, పోగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


