జాతీయస్థాయిలో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో రాణించాలి

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ లక్ష్యమని అసోసియేషన్‌ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య అన్నారు. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సింగరేణి అంబేడ్కర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 350మంది బాలబాలికలు అండర్‌–14, అండర్‌–16 విభాగాల్లో పాల్గొన్నారు. అండర్‌–14లో ట్రయాథ్లాన్‌–ఏ, బీ, సీ విభాగాలతో పాటు పరుగు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌త్రో పోటీలు నిర్వహించారు. అండర్‌–16లో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌త్రోలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య, ఉపాధ్యక్షులు జాగరి అజయ్‌, పర్స శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.సారంగపాణి, ట్రెజరర్‌ సూదం సాంబమూర్తి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement