పనుల ప్రతిపాదనలు సమర్పించాలి | - | Sakshi
Sakshi News home page

పనుల ప్రతిపాదనలు సమర్పించాలి

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

● కలెక్టర్‌ రాహుల్‌శర్మ

భూపాలపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు గోదావరి పుష్కరాల నిర్వహణ సందర్భంగా చేపట్టనున్న వివిధ అభివృద్ధి, రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, అంచనాలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర అభివృద్ధి పనులపై శనివారం దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్‌ హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ, దేవాదాయ, ప్రణాళిక, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గతంలో మంజూరైన రూ.92లక్షల పనులతో పాటు రూ.5.08కోట్లతో చేపట్టాల్సిన అదనపు రహదారి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. మిగిలిన బ్యాలెన్స్‌ పనులకు కూడా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)కు సంబంధించిన ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక రూపొందించి పంపాలని స్పష్టం చేశారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రతిపాదనలను వేగంగా పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాలని అధికారులను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, దేవాదాయ, ప్రణాళిక, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement