● ఎమ్మెల్యే సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆమె పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహోన్నత ఉద్యమం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా పాల్గొన్నారు


