భూపాలపల్లి అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా సహకార కార్యాలయంలో 15మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వాల్యానాయక్ తెలిపారు. సభ్యులు శాంతికిరణ్, కృష్ణమోహన్, అనిల్, హరీశ్, మధు, పి.శ్రీనివాస్, సాంబమూర్తి, శ్రీనివాసరావు, సతీష్, సమ్మయ్య, ప్రత్యూష, కె.శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి, పాపయ్య, యుగదీశ్వర్ ఎన్నికయ్యారు. వీరిలో నుంచి ఈ నెల 30న చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
చిట్యాల: మండలంలోని నైన్‌పాక విద్యార్థి దొంతుల సనత్ ఈనెల 27నుంచి 30వరకు జరిగే జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ బండి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయి వరకు ఎంపికవడం ఎంతో గర్వకారణం అన్నారు. అనంతరం విద్యార్థి సనత్‌ను అభినందించారు.
పర్యాటక ప్రాంతంగా
అభివృద్ధి చేస్తాం
రేగొండ: పాండవుల గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం పర్యాటక, అటవీ శాఖ ఆధ్వర్యంలో పాండవులగుట్టలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతపు సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. బుగులోని గుట్టపైకి తిరుమల తరహాలో స్లాబ్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జాతరకు, పాండవుల గుట్టలకు వివిధ మార్గాల దారులకు రూ.10 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన, పార్కింగ్ స్థలాలు, రిసార్ట్స్ వంటి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాండవుల గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. పాండవుల గుట్టలలో ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు పడేయకుండా పరిశుభ్రతను కాపాడాలని ఎస్పీ సంకీర్త్ కోరారు. అనంతరం పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా అటవీశాఖ అధికారి అప్పలకొండ, జిల్లా పర్యాటక అధికారి రఘు, సీఐ కరుణాకర్ రావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు సుదర్శన్, మౌనిక, కోటంచ ఆలయ మాజీ చైర్మన్ సంపత్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి, ఓంప్రకాశ్, ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు పర్యాటక ప్రగతికి రాష్ట్రస్థాయి గుర్తింపు
ములుగు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల ప్రగతికి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును ఘనంగా సత్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్‌కు జ్ఞాపిక అందజేశారు. రామప్ప, మేడారం, లక్నవరం, బొగత, మల్లూరు తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.
రామప్ప దేవాలయంలో పోర్చుగల్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయాన్ని శనివారం పోర్చుగల్ దేశానికి చెందిన నికోలెట్టా మత్సూర్ దర్శించుకున్నారు.


