అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం | - | Sakshi
Sakshi News home page

అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం ఇద్దరు డాక్టర్లే..

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్‌కు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే కుమారులుగా భావిస్తూ వారు ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు. వారి నమ్మకాన్ని కూతుళ్లు నిలబెట్టారు. ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. నేడు (ఆదివారం) కూతుళ్ల దినోత్సవం (డాటర్స్‌ డే) సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తల్లిదండ్రుల కల నెరవేర్చిన కూతుళ్లు, కూతుళ్ల కోసం కష్టపడిన తల్లిదండ్రులపై ప్రత్యేక కథనాలు.

● చదువుకోలేదన్న వెలితిని.. పిల్లల చదువుతో తుడిచేసుకున్న తల్లిదండ్రులు

● వారి ఆశలను వమ్ము చేయకుండా

నెరవేర్చిన కూతుళ్లు

● ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురు

నేడు కూతుళ్ల

దినోత్సవం (డాటర్స్‌ డే)

తండ్రి బానోత్‌ సమ్మయ్యతో కూతురు గీత

కష్టాల నుంచి ఎస్సై..

భూపాలపల్లి అర్బన్‌: మల్హర్‌ మండలం అన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన బానోత్‌ సమ్మయ్య బతుకుదెరువు లేక గోదావరిఖనికి వెళ్లాడు. అడ్డా కూలీగా పనిచేస్తూ ఇద్దరు కొడుకులు, ఒక కూతురును చదివించాడు. కొడుకులతో సమానంగా కూతురిని చదివించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలిసిన ఓ ప్రైవేట్‌ పాఠశాల యజమాని ఫీజుల విషయంలో సహకరించాడు. పేదరికం కారణంగా బంధువులు, ఇరుగుపొరుగు వారు చులకనగా చూసినా పిల్లల చదువును మాత్రం ఆపలేదు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులను కళ్లారా చూసిన కూతురు గీత పోలీస్‌ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో కోచింగ్‌ కోసం డబ్బులు లేకపోవడంతో తండ్రి బంగారం, భూమిని తాకట్టు పెట్టి అధిక వడ్డీకి అప్పు చేసి ఆమెను పంపించాడు. మూడేళ్ల క్రితం ఎస్సై ఉద్యోగం సాధించింది. ఉద్యోగం వచ్చిన వెంటనే బ్యాంకు రుణం తీసుకుని సుమారు రూ.10 లక్షల అప్పు తీర్చింది. తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయడంతో పాటు సమాజంలో వారి గౌరవాన్ని నిలబెట్టింది. పేదరికాన్ని జయించి పోలీస్‌ అధికారిగా ఎదిగిన గీత ప్రస్తుతం భూపాలపల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. గీత తమ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిందని తండ్రి భావోద్వేగంతో చెబుతున్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్‌–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న చింత లేకుండా వారిని చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో పిడియాట్రిక్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధిలోని నీలోఫర్‌ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. చిన్నమ్మాయి మేఘన కూడా తామేమీ తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్‌ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్‌ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిలగా భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్‌–రమాదేవి సగర్వంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement