● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన హోంగార్డు గోలి శ్రీనివాస్ కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. పోలీసుశాఖ తరఫున వెల్ఫేర్ ఎక్స్‌గ్రేషియా కింద మంజూరైన రూ.20 వేల విలువైన చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎస్పీ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డు శ్రీనివాస్ అకాల మరణం పోలీస్ శాఖకు తీరని లోటని అన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ వెల్ఫేర్ పథకాలు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించడంలో కీలకంగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్‌ఐ సంతోష్‌కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


