భూపాలపల్లి అర్బన్: దేశ ప్రాచీన వైద్య విజ్ఞానమైన ఆయుర్వేదం.. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ 50 పడకల ఆస్పత్రిలో బుధవారం మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయుష్ వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెగా శిబిరంలో 289 మంది వైద్య సేవలు పొందారు.
ఆయుష్ సేవలు మరింత చేరువ
గ్రామీణ, పట్టణప్రాంతాల్లో వైద్యశిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ కె.రాఘవేందర్ రావు తెలిపారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే సందేశంతో ఉచిత వైద్యపరీక్షలు, ఆరోగ్య సలహాలు, ఆయుష్ వైద్య విధానాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ మధుమిత, డాక్టర్ ప్రేమ్‌సాగర్, కన్వీనర్ డాక్టర్ బుసారా, వైద్యులు డాక్టర్ జగదీష్ కన్నా, డాక్టర్ సదానందం, డాక్టర్ గీత, డాక్టర్ అజయ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


