కంకరేసి వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

కంకరేసి వదిలేశారు!

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

వెల్లంపల్లి–ఎంపేడులో కంకరవేసి వదిలేసిన రోడ్డు నిర్మాణ పనులు

టేకుమట్ల: వెల్లంపల్లి–ఎంపేడు ప్రధాన రహదారి నిర్మాణం పనులు అటకెక్కడంతో ప్రయాణికులు, స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి మూడేళ్లుగా శిథి లం కావడంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రూ.3కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టర్‌ రోడ్డుపై కంకరపోసి పనులు అరకొరగా వదిలేశాడు. దీంతో రాళ్లు తేలి రోడ్డుపై వాహనాలు నడపలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.

సంవత్సరం క్రితం నిధులు మంజూరు

టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి–ఎంపేడు ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో సంవత్సరం క్రితం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.3కోట్ల నిధులు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వా త సుమారు ఆరు నెలల అనంతరం కాంట్రాక్టర్‌ మొరంతో చదును చేసి కంకర పోశాడు. అనంతరం రోలర్‌తో చదును చేసి పత్తాలేకుండా పోయాడు. దీంతో అప్పటినుంచి పనులు ముందుకు సాగడం లేదు. కంకర తేలి ఉంది. ఎంపే డు గ్రామం నుంచి టేకుమట్ల మండలకేంద్రాని కి రావడానికి ఇదే ప్రధాన రహదారి. దీంతో వా హనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. వర్షం వస్తే పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతోంది.

కంకరతో కష్టాలు...

వెల్లంపల్లి–ఎంపేడు, కుందనపల్లి గ్రామాల రైతుల పొలాలు ఎక్కువగా వెల్లంపల్లి–ఎంపేడు ప్రధాన రోడ్డు వెంటే ఉండడంతో ప్రతీ రోజు ఆ దారిగుండా వెళ్తూ పంట పొలాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు పొడవునా కంకరపోసి వదిలేయడంతో కాడెడ్లు, రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడితేనే ప్రజల ఇబ్బందులు తీరుతాయని, ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి బీటీ రోడ్డు నిర్మానానికి కృషి చేయాని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సకాలంలో పూర్తి చేయాలి

ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపడితేనే ప్రజల ఇబ్బందులు తొలుగుతాయి. బీటీ రోడ్డును కాంట్రాక్టర్‌ నిర్మించేలా అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలి. పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. కంకర పోసి వదిలేయడంతో కంకర లేసి అక్కడక్కడ ప్రమాదకరంగా ఉంది. ద్విచక్ర వాహణదారులు పడిపోయే ప్రమాదం ఉంది.

– కొలిపాక రాజయ్య

మాజీ సర్పంచ్‌, ఎంపేడు

మొగుళ్లపల్లిలోనూ అదే పరిస్థితి

మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట నుంచి వయా పాత ఇస్సిపేట మీదుగా చింతలపల్లి వరకు రూ.కోటి నిధులతో సెప్టెంబర్‌ 2025లో బీటి పనులకు శంకుస్థాపన చేశారు. పనులను కాంట్రాక్టర్‌ ప్రారంభించి కంకర పోసి వదిలేశాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, రైతులు కంకరపై వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చింతలపల్లి గ్రామాలకు, పొలాలకు వెళ్లే రైతులు పశువులను తీసుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై పోసిన కంకరతో కష్టాలు రెట్టింపు అయ్యాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రాత్రి పంట పొలాలకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలనికోరుతున్నారు.

రూ.3కోట్లతో ఎంపేడు–వెల్లంపల్లి

రోడ్డు పనులు

అర్ధంతరంగా నిలిపేసిన కాంట్రాక్టర్‌

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement