న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి బొగ్గు గనుల్లో పరికరాల కొరత తీవ్రరూపం దాలుస్తోంది. ఉత్పిత్తికి అవసరమైన విడిభాగాలు, చిన్నచిన్న పరికరాల సరఫరా కాకపోవడంతో కార్మికులు అరకొర సామగ్రితోనే ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. గుర్తింపు సంఘాల ఎన్నికల్లో యూనియన్లు హామీలు గుప్పించడం తప్ప కార్మికుల కనీస సమస్యలు తీర్చడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగినా విధుల్లో కార్మికులకు కావాల్సినవి మాత్రం మెరుగుపడటం లేదు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి పూర్తిస్థాయిలో సామగ్రిని అందుబాటులోకి తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు.
అరకొర సామగ్రి
గనుల్లో విధులు నిర్వహించే కార్మికులకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అరకొర సామగ్రితోనే లోపలికి వెళ్తున్నారు. కోల్‌కట్టర్‌లకు వినియోగించే డ్రిల్‌రాడ్‌లు, డ్రిల్‌బిట్‌లను సరఫరా చేయకపోవడంతో ప్రతీ రోజు వాటితోనే పనులు చేయాల్సి వస్తోంది. అరిగిపోయిన డ్రిల్ రాడ్లను అతికించుకుని పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నాణ్యత లేని డ్రిల్ బిట్లు సరఫరా చేయడంతో కొద్ది కాలానికే అవి పనిచేయకుండా పోతున్నాయి. వాటిని తిరిగి పదును చేయించుకొని పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వీటితో పాటు బొగ్గు, మెటీరియల్ రవాణాతో పాటు కార్మికులను గనుల్లోకి తీసుకెళ్లేందుకు వినియోగించే మ్యాన్ రైడింగ్ కోసం ఏర్పాటు చేసే ట్రాక్‌లైన్‌లు సైతం సక్రమంగా లేవని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సిబ్బంది వినియోగించే పరికరాలు, పంపు మోటార్లకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉండటం లేదు. బెల్టు నడిచేందుకు అవసరమైన బేరింగ్‌లు అందుబాటులో ఉండటం లేదు.
యంత్ర విడి భాగాలు లేక..
కంపెనీలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు యాజమాన్యం భారీ యంత్రాలను కొనుగోలు చేస్తోంది. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఓపెన్ కాస్టు గనులు, భూగర్భ గనుల్లో వినియోగిస్తున్న యంత్రాలకు సంబంధించిన విడిభాగాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో చాలా సమయం వృథాగా నిలిచిపోతున్నాయి. ఎస్‌డీఎల్ యంత్రాల విడిభాగాల కొరతతో పాతవాటినే మరమ్మతు చేసి యంత్రాలను నడిపిస్తున్నారు. కొన్ని గనుల్లో ఫిట్‌నెస్ లేని యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తుండటంతో అవి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 99510 50872
అరకొర సామగ్రితోనే విధులు
యంత్రాల విడిభాగాలు
అందక ఇబ్బందులు
నాణ్యత లేని బూట్లు..
ఏళ్లుగా రెయిన్‌కోట్లు, స్వెటర్లకు దూరం
విధుల్లో సింగరేణి కార్మికుల ఎదురీత
భూగర్భ గనులు : 4
ఓపెన్‌కాస్ట్ గనులు : 2
కార్మికుల సంఖ్య : 5 వేలు
వైర్లతో కట్టుకుని..
సింగరేణి కార్మికులకు అందజేస్తున్న బూట్లలో నాణ్యత ఉండటం లేదు. ఆరు నెలలకోసారి అందించే బూట్లు ఏడాది కాలంగా రావడం లేదు. దీంతో బూట్లు చిరిగిపోయి వాటి కింది భాగం అరిగిపోతోంది. బూట్లు చినిగిపోవడంతో కార్మికులు వాటికి వైర్లు, దారలతో కుట్టుకొని విధులు హాజరుకావాల్సిన దుస్థితి దాపరించింది. సాక్సులు కార్మికులందరికీ అందడం లేదు. రెయిన్ కోట్లు, స్వెటర్లను కొన్నేళ్లుగా సరఫరా చేయడం లేదు. చలికాలంలో జంక్షన్లలో విధులు నిర్వహించే ట్రామర్లు స్వెటర్లు లేక తీవ్ర ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలకు గురైన కార్మికులు ఉన్నారు.
యాజమాన్యం దృష్టిసారించడం లేదు..
సింగరేణి కార్మికులకు పని స్థలాల్లో కావాల్సిన పనిముట్లపై సింగరేణి యాజమాన్యం దృష్టిసారించడం లేదు. బొగ్గు ఉత్పత్తికి కావాల్సిన పరికరాలను అందించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైంది. ఏళ్ల తరబడి కార్మికులకు పరికరాలు అందించకపోవడంతో పాడైన పరికరాలతో పనులు చేయడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. ఉన్నటువంటి పరికరాలతో పని చేయాలని అఽధికారులు వేధిస్తున్నారు.
– అప్పాని శ్రీనివాస్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు


