భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్‌లో ప్రజల నుంచి 18ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


