డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త
10 ఎకరాల్లో డంపింగ్ యార్డు..
భూపాలపల్లి పట్టణం బాంబులగడ్డ సమీపంలో సుమారు 10 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నుంచి 2022లో రూ.60లక్షల నిధులను కేటాయించారు. కొంతకాలంగా డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నా.. అమలు కావడం లేదు. నిత్యం పట్టణంలో సేకరిస్తున్న సుమారు 13 మెట్రిక్ టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలను సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో కుప్పులుగా చెత్త నిల్వలు డంపింగ్ యార్డులో పేరుకుపోయాయి. సుమారు 10వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వ్యర్థాలు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
పొగతో ఇబ్బందులు..
చాలా సందర్భాల్లో ప్రమాదవశాత్తు డంపింగ్ యార్డులో మంటలు చెలరేగగా.. కొన్నిసార్లు సిబ్బందే చెత్తను తగలబెడుతున్నారని సమీప కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో నిత్యం పొగలు అలుముకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వేసవి కాలంలో అయితే గాలు లకే మంటలు చెలరేగుతాయి. దీంతో పరిసర ప్రాంతాలు గాలి కాలుష్యంతో పాటు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ చెత్త నిల్వలు పేర్చుకుంటూ పోవడం తప్ప.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పట్టణానికి చెత్తనిల్వలు సవాల్‌గా మారాయి.
వ్యర్థాలు తరలించడంలో తప్పని తిప్పలు
మున్సిపాలిటీలో కానరాని వ్యవస్థ
క్షేత్రస్థాయిలో అమలుకాని
ఉన్నతాధికారుల ఆదేశాలు
నిర్వహణలో విఫలమవుతున్న
యంత్రాంగం


