భూపాలపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి దరఖాస్తుల సంఖ్య తగ్గడం లేదు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వచ్చిన వారే మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక తమ పరిధిలో పరిష్కారమయ్యే వాటిని ఆన్‌లైన్ చేస్తూ, మిగిలిన వాటిని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతీ వారం 60కి పైగా..
కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సుమారు వందకు పైగా దరఖాస్తులు వచ్చేవి. మండలకేంద్రాల్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తుండటంతో కొద్దిరోజులుగా కలెక్టరేట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60మంది వరకు వస్తున్నారు. అందులో సగానికి పైగా వ్యవసాయ భూములకు పట్టాలు, పింఛన్‌ల మంజూరు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినవే ఉంటున్నాయి. దీంతో జిల్లాస్థాయి అధికారులు వీలైన వాటిని పరిష్కరించి, మిగిలిన వాటిని మండలస్థాయి అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 75 అప్లికేషన్లు రాగా అందులో సైతం పట్టాలు, పింఛన్‌లు, ఉద్యోగాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి.
ఆ దరఖాస్తులు ఆన్‌లైన్ చేయట్లే..?
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పింఛన్లు, భూ తగాదాలు, అటవీ భూముల్లో బోర్లకు అనుమతి, అసైన్డ్ భూములకు పట్టాలు.. తదితర పరిష్కరించలేని వాటిని ఆన్‌లైన్‌లో చూపించట్లేదని తెలుస్తోంది. దీంతో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి సుమారు 60మందికి పైగా వస్తున్నప్పటికీ అధికారుల లెక్కలతో పోలడం లేదు.
అధికంగా ఈ శాఖలకే..
ప్రజావాణిలో అధికంగా నాలుగైదు శాఖలకే దరఖాస్తులు అందుతున్నాయి. ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు రెవెన్యూశాఖకు 18, పంచాయతీరాజ్‌కు 53, విద్యాశాఖకు 24, మహిళ శిశు సంక్షేమశాఖకు 32 అప్లికేషన్లు వచ్చాయి.
ఆరుసార్లు ఫిర్యాదు చేశాడు..
పదేళ్లుగా ఆశవర్కర్లుగానే..
‘మాజీ’లను మరచిపోయారు...
పక్క ఫొటోలో కనిపిస్తున్న వారంతా మావోయిస్టు ఉద్యమంలో పని చేసి సర్కారు సూచనలతో 15ఏళ్ల క్రితం జన జీవన స్రవంతిలో కలిశారు. వీరికి పునరావాసం కింద అందాల్సిన ఇంటి స్థలం, వ్యవసాయ భూమి ఇప్పటివరకు అందలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.
ఇతని పేరు కె.శ్రావణ్‌కుమార్‌రెడ్డి. మహాముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఈయన గ్రీవెన్స్ సెల్‌లో ఆరుసార్లు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. గ్రామానికి చెందిన పరంసింగ్ అనే వ్యక్తి పొలాలకు వెళ్లే దారిని సుమారు 20 ఫీట్ల వెడల్పుతో 30 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. దీంతో ఆ భూమి అవతల ఉన్న రైతులు పంట పొలాలను సాగు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పశువులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై మూడేళ్లలో ఆరుసార్లు రెవెన్యూ అధికారులు, ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో శ్రావణ్‌కుమార్‌రెడ్డి సోమవారం మరోమారు ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు అందజేశాడు.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి భూపాలపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగుడు మిర్యాల మల్లయ్య. 1991లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతడి కుడిచేయిని పూర్తిగా కోల్పోయాడు. కూలీ పని చేసే అవకాశం లేకపోవడంతో భార్య గృహ నిర్మాణ పనులకు వెళ్తూ కుటుంబాన్ని సాకుతుంది. గడిచిన ఏడేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం దరఖాస్తు ఇస్తూనే ఉన్నాడు. అయినా ఇప్పటి వరకు ఇళ్లు మంజూరు చేయలేదు. దివ్యాంగుల కోటాలో తనకు ఇళ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు.
ఫొటోలో ఉన్న వారంతా ఎంపీహెచ్‌డబ్ల్యూ చదివి, శిక్షణ పూర్తి చేసి పదేళ్లుగా ఏఎన్‌ఎంగా పోస్టుల కోసం ఎదురుచూస్తూ జిల్లాలో ఆశ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎంపీహెచ్‌డబ్ల్యూ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అనుభవం లేని కారణంగా వీరిని ఎంపిక చేయలేదు. ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వాలని ఆశవర్కర్లు కోరుతున్నారు.
వినతి పత్రం అందించేందుకు వచ్చిన
మాజీ మావోయిస్టులు


