ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

గణపురం: శ్రావణ చివరి సోమవారం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో తెల్లవారుజామునే అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

విద్యుత్‌ ఎస్‌ఈగా సదానందం

భూపాలపల్లి రూరల్‌: విద్యుత్‌ శాఖ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా నాగెల్లి సదానందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జ్‌గా ఉన్న భిక్షపతి రిలీవ్‌కాగా భూపాలపల్లి ఎంఆర్‌టీ కన్‌స్ట్రక్షన్‌ డివిజనల్‌ ఇంజనీర్‌గా మూడేళ్లుగా పనిచేస్తున్న సదానందం పదోన్నతిపై ఎస్‌ఈగా బాధ్యతలు తీసుకున్నారు.

ఉద్యోగుల

హక్కుల కోసం..

భూపాలపల్లి అర్బన్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌–ఉద్యోగుల హక్కుల సాధన సభ’ను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో సోమవారం కలెక్టరేట్‌లో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్‌ బూరుగు రవి, కన్వీనర్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సభకు జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, దశరథ రామారావు, షఫీ, ఎస్‌కే అబ్బాస్‌, కుసునపు కిరణ్‌కుమార్‌, నక్క తిరుపతి, మందల రవీందర్‌రెడ్డి, పెండ మధుసూదన్‌, కొత్త కుమార్‌, తిరుపతిరెడ్డి, సేవానాయక్‌, భార్గవ్‌, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

ఓపెన్‌కాస్టు గని పరిశీలన

వెంకటాపురం(ఎం): మండలకేంద్రం శివారులో ప్రారంభించే ఓపెన్‌కాస్టు గని ప్రాంతాన్ని ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, సింగరేణి సంస్థ భూపాలపల్లి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌ మురళీ మోహన్‌ సంబంధిత అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. గని ప్రాంతం ఎంతమేర ఉంది అనే ఆంశాన్ని మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. ప్రస్తుతం ఆ భూముల్లో సాగవుతున్న పంటలు ఏంటి.. అనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావును సింగరేణి సంస్థ అధికారులు కలిసి మాట్లాడారు. ఓపెన్‌కాస్టు ప్రాంతంలో నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలు, వాటి ఆధారంగా చేపట్టాల్సిన చర్యలు, పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సింగరేణి ఉన్నతాధికారులతో పాటు ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌ జనరల్‌ మేనేజర్‌ దేవేందర్‌, ఎన్విరాన్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సిద్ధులు, ఎక్స్‌ఫ్లోరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ కులశ్రేష్టతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement