పాత యూనిఫాంలతోనే వస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

పాత యూనిఫాంలతోనే వస్తున్నాం..

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

పాత యూనిఫాంలతోనే వస్తున్నాం.. ఇంట్లో కుట్టించే పరిస్థితి లేదు.. ఇంకా క్లాత్‌ రాలేదు..

నిరుడు అందంచిన యూనిఫాంలు చినిగిపోయాయి. పాత యూనిఫాంలు వేసుకునే స్కూల్‌కు వస్తున్నాం. కొత్తవి వెంటనే అందించాలి. నిరుడు కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పుడు అట్లనే లేట్‌ చేస్తున్నారు.

బి.ఆరాధ్య, పీఎస్‌ ఆజాంనగర్‌, 5వ తరగతి

పాఠశాలలో ఇంకా యూనిఫాంలు ఇవ్వలేదు. ఇంట్లో కొత్తవి కుట్టించే పరిస్థితి లేదు. దీంతో పాతవాటినే వేసుకొని పాఠశాలకు వస్తున్నాం. పాఠశాలలలు ప్రారంభమై రెండు నెలలు గడిచాయి. ఎప్పుడు ఇస్తారో తెలియదు. జెండా వందనం కూడా దగ్గరకు వచ్చింది.

–శివకుమార్‌, పీఎంశ్రీ పాఠశాల,

గొల్లబుద్దారం, 8వ తరగతి

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా విద్యార్థులకు కావాల్సిన క్లాత్‌ రాలేదు. దీంతో యూనిఫాంల పంపిణీ ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం జిల్లాల వారీగా పంపిణీ చేస్తుంది. మన జిల్లాకు ఎప్పుడు వస్తాయో తెలియదు. క్లాత్‌ వచ్చిన వెంటనే ఇందిర మహిళా శక్తి సంఘాలతో కుట్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మహిళా సంఘాలలో సమావేశం నిర్వహించాం.

– రమేష్‌, సీఎంఓ, జిల్లా విద్యాశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement