భూపాలపల్లి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకల్లో ప్రతీ కార్యక్రమం ‘మినిట్ టు మినిట్’ ప్రణాళిక ప్రకారం అంతరాయం లేకుండా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరిక్రిష్ణ, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వరరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి..
దుబ్బపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి..
ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ, రక్షణ చర్యలు, ప్రజలకు వైద్యసేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 12 నుంచి అక్టోబర్ 18 వరకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ అఽధికారులపై ఆగ్రహం
భూపాలపల్లి అర్బన్: కేజీబీవీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ రాహుల్‌శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై డీఈ రామకృష్ణతో ఫోన్ ద్వారా మాట్లాడి, వారం రోజుల్లోగా పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు విషయాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, ఎంపీడీఓ తరుణ్‌ప్రసాద్, పాఠశాల ఎస్‌ఓ ఈశ్వరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
దుబ్బపల్లి అభివృద్ధి పనులు వేగిరం
కలెక్టర్ రాహుల్ శర్మ


