పీఆర్‌సీని అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీని అమలు చేయాలి

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

చిట్యాల: ఉపాధ్యాయులకు పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నక్క తిరుపతి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని వివిధ పాఠశాలల్లో యూటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఆర్‌సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు దాటినా ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలను తక్షణమే పరిష్కరించాలని.. లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాముకుంట్ల తిరుపతి, జిల్లా బాధ్యులు బండారి సదయ్య, మండల అధ్యక్షుడు యోగానంద చారి, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌కుమార్‌ పాల్గొన్నారు.

రాజీమార్గంతో

పరిష్కారం

భూపాలపల్లి రూరల్‌: కేసుల్లో చిక్కి ఇబ్బందిపడే పేదవారికి జిల్లా న్యాయ సేవాధికారాసంస్థ అండగా ఉంటుందని, రాజీమార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం మేలని డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పుప్పాల శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం, చికెన్‌పల్లి, రాంపూర్‌, కమలాపూర్‌ గ్రామాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వివాదాలు లేని సోదరాభావంతో జీవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్‌, మహిత, వెంకటేష్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పాండవుల గుట్ట

సందర్శన

రేగొండ: రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌ నేత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో వేసిన పెయింటింగ్‌లను పరిశీలించారు. అనంతరం గుట్టలపై ట్రెక్కింగ్‌ చేశారు. చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట హనుమకొండ జిల్లా అటవీశాఖ అధికారి ముకుంద్‌ రెడ్డి, ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి అప్పలకొండ, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చంద్రమౌళి, ఫారెస్ట్‌ బీట్‌ అధికారి వెంకట్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement