‘సార్‌’ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

‘సార్‌’ సేవలు చిరస్మరణీయం

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని విగ్రహానికి కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమే ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలకు నిజమైన నివాళి అని తెలిపారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనలో జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య జయశంకర్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement