భూపాలపల్లి: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లాకేంద్రంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను ఎస్పీ సందర్శించారు. సెంటర్‌లోని అత్యాధునిక సాంకేతిక వసతులు, శిక్షణ ప్రయోగశాలలు, విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఎస్పీ మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రతీ యువకుడి విజయానికి కీలకమని సూచించారు. ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించి, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్ జుమ్లానాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ డి నరేష్‌కుమార్ పాల్గొన్నారు.
మహనీయుడు జయశంకర్ సార్
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘సార్’ చిత్ర పటానికి ఎస్పీ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


