● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి: జిల్లాలో భూ హక్కుల చట్టం–2025 అమలు నేపథ్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో భూ భారతి పోర్టల్ వినియోగంపై రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాసేవలకు అంతరాయం లేకుండా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ ద్వారా సిబ్బంది సామర్థ్యం పెరిగి, భూ సంబంధిత సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఈ సెక్షన్ పర్యవేక్షకుడు హరిహర ప్రసాద్ పాల్గొన్నారు.
10 నుంచి
నిరసన కార్యక్రమాలు
భూపాలపల్లి అర్బన్: బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీఐ సభ్యుడు మంద నరసింహారావు పిలుపునిచ్చారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని 12వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


