నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

రేగొండ: ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి సంరక్షణకు చర్యలు చేపట్టి, భూగర్భ జలాల పెంపులో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం మండలంలోని గూడెపల్లి గ్రామంలో రైతు లింగంపల్లి సంతోష్‌ రావు నిర్మించిన ఫాం పాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జల సంరక్షణ అత్యంత కీలకమని, వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. వర్షాభావ సమయంలో ఫాంపాండ్స్‌లో నిల్వ ఉన్న నీటితో పంటల సాగుతో పాటు, చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఫాం పాండ్స్‌ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ తెలిపారు.

అంతర పంటలను సాగు చేయాలి

తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం సాధించే దిశగా రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటు అంతర పంటలను సాగు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ రైతులకు సూచించారు. మండలంలోని రామన్నగూడెం తండా శివారులో రైతు శ్రీరాముల రఘుపతి చేపట్టిన అంతర పంటల సాగును పరిశీలించారు. అనంతరం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాగణంలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. యుద్ధప్రతిపాదికన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ, జిల్లా ఉద్యానవన అధికారి తిరుపతి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఓ ఏపీడీ సంతోష్‌రెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాస్‌, నాయబ్‌ తహసీల్దార్‌ రజాక్‌, ఎంపీఓ సురేష్‌ పాల్గొన్నారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

భూపాలపల్లి అర్బన్‌: ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సిబ్బంది సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ వెంకటరత్నం బుధవారం కలెక్టర్‌ను తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వైద్యసేవలు, సిబ్బంది సమయపాలన, పారిశుద్ధ్య కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో పరిశుభ్రత పకడ్బందీగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవగాహనతోనే హెచ్‌ఐవీ నియంత్రణ

భూపాలపల్లి: ప్రజల్లో నిరంతర అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ ఉంటుందని కలెక్టర్‌ రాహుల్‌శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొబిలైజేషన్‌ ఫర్‌ ఎయిడ్స్‌ సురక్ష హ్యాండ్‌బుక్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాటాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ అధికారి డాక్టర్‌ సందీప్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరత్నం, దిశ సభ్యులు జ్యోతి పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement